News May 11, 2024

చిత్తూరు: సమయం లేదు మిత్రమా.. ఓట్ల వేటలో అభ్యర్థులు

image

ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Similar News

News December 28, 2025

చిత్తూరు: DCCB ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు

image

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ఈనెల 27తో ముగియగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2026 జూన్ 26వ తేదీ వరకు రాజశేఖర్ రెడ్డి DCCB నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు.

News December 28, 2025

నేడు పనిచేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

image

చిత్తూరు జిల్లాల్లోని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు ఆదివారం పనిచేస్తాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. వీరితో పాటు హెచ్ఎ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని ఆయన కోరారు.

News December 28, 2025

చిత్తూరు: మీ ఊర్లో కరెంట్ సమస్యలు ఉన్నాయా.?

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. జిల్లాలో మొదటిసారి కార్యక్రమాన్ని సీఎండీ ఆదేశాల మేరకు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు తమ సమస్యలపై ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.