News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. భూపాలపల్లికి 2వ ర్యాంక్

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. భూపాలపల్లి(D)లో రెగ్యులర్ విద్యార్థులు 1454 మంది పరీక్షలు రాయగా 1184 మంది పాసై 82.34 శాతంతో స్టేట్‌లోనే రెండో స్థానం వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 302 మందికి 255 మంది పాసై 84.44 శాతంతో 4వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 44 మందికి 26 మంది పాసై 59.09%తో 1వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో ఐదుగురికి ఒక్కరు పాసై 20.0%తో చివరి(35) స్థానం వచ్చింది.
Similar News
News April 20, 2026
@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.
News April 20, 2026
NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.
News April 20, 2026
సేంద్రియ మేళా సూపర్ హిట్: కలెక్టర్

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.


