News May 11, 2024
ఇక వడగాల్పులు ఉండవు: IMD
ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడటం వల్ల అటు నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగాల్పుల తీవ్రత తగ్గుతోందని తెలిపింది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని వివరించింది.
Similar News
News December 28, 2024
నితీశ్‌కు YS జగన్ అభినందనలు
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో అదరగొట్టిన భారత క్రికెటర్ నితీశ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ అభినందించారు. ‘మెల్‌బోర్న్‌లో చిన్న వయసులోనే సెంచరీ చేసిన నితీశ్‌కు శుభాకాంక్షలు. 21 ఏళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచస్థాయి జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆయన సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం. నితీశ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని జగన్ ఆకాంక్షించారు.
News December 28, 2024
విమాన ప్రమాదం దురదృష్టకరం.. సారీ: పుతిన్
కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అందుకు అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్లామ్ అలియేవ్‌కు క్షమాపణలు చెప్పారు. అజార్ బైజాన్‌లోని బాకు నుంచి రష్యా బయల్దేరిన విమానం కజకిస్థాన్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 38 మంది మరణించారు. కాగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు రష్యా ప్రయోగించిన క్షిపణి ఒకటి విమానాన్ని తాకినట్లు అనుమానిస్తున్నారు.
News December 28, 2024
YCP ఫీజు రీయింబర్స్‌మెంట్ ధర్నా వాయిదా
AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో జనవరి 3న తమ పార్టీ నిర్వహించాల్సిన ధర్నాను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్ఠానం తెలిపింది. దీనిని అదే నెల 29న నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనవరి 3న విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.