News May 11, 2024

శ్రీకాకుళం: రాజకీయ పార్టీలకు ఎస్పీ సూచనలు

image

పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల దూరంలో మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రాధిక సూచించారు. ఆ ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడకూడదని, ఆయా నియోజకవర్గాల్లో బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవ్వరూ ఉండేందుకు వీలు లేదని అన్నారు. లాడ్జిల్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌‌‌‌లో ఉండేవారు వెళ్లిపోవాలని ఎస్పీ ఆదేశించారు.

Similar News

News March 21, 2026

అరసవల్లి ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రం ఇదే

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రాన్ని శనివారం అధికారులు విడుదల చేశారు. ఇంద్రపుష్కరిణి అభివృద్ధికి రూ.4కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించిన విషయం విదితమే. ఈ మేరకు పుష్కరిణి నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. కాగా భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆలయంలో పలు మార్పులకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News March 21, 2026

గ్లోబల్ డెస్టినేషన్‌గా ఉత్తరాంధ్ర : రామ్మోహన్

image

విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ తన బలాన్ని ప్రపంచానికి చూపిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం విశాఖ నోవాటెల్ హోటల్ లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫ్‌రెన్స్‌కు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర గ్లోబల్ డెష్టినేషన్‌గా రూపుదిద్దుకొంటోందని అన్నారు.

News March 21, 2026

సంతబొమ్మాళి: ‘వేసవి తాపాన్ని తట్టుకొనే విత్తనగుళికలు శ్రేష్టం’

image

వేసవితాపన్ని తట్టుకొని సజీవంగా పంట ఉండాలంటే విత్తనాలను విత్తనగుళికలు తయారు చేసుకోవటం శ్రేష్టమని శ్రీకాకుళం జిల్లా అడిషనల్ DPM ధనుంజయ్ అన్నారు. శనివారం సంతబొమ్మాళి మండలం కే.జి వలసలో రైతులు పొలాల్లో చేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ విత్తనాలు జల్లుకోవడం ద్వారా వాతావరణంలో ఉండే తేమని గ్రహించి మొలకలువచ్చి పంట ఏపుగా పెరుగుతుందన్నారు. బీజామృతం, ఘణజీవామృతం, బంకమట్టి, బూడిదలో విత్తనాలు కలపాలన్నారు.