News April 13, 2026

మెదక్: ఈ అమ్మాయిలు GREAT

image

ఇంటర్ ఫలితాల్లో మెదక్ మైనారిటీ బాలికల కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి స్టేట్ ర్యాంకులు సైతం కైవసం చేసుకున్నారు. BiPC-1లో హారిక 438/440 సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, MPC-1లో శృతిక, ఆఫహ బేగం ఇద్దరూ 467/470 సాధించి స్టేట్ 2వ, BiPC -1లో శ్రావణి 436/440 సాధించి స్టేట్ 3వ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. MPC-2లో అక్షయ 990/1000 సాధించి మొదటి స్థానంలో నిలిచింది.

Similar News

News April 15, 2026

పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.

News April 15, 2026

ADB: ఇంటర్‌ ఫలితాల హోరు.. అడ్మిషన్ల జోరు!

image

ఇంటర్‌ ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలో విద్యా వ్యాపారం ఊపందుకుంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫొటోలతో ప్రకటనల హోరు మొదలైంది. టాపర్లకు ఉచిత సీట్లు, ఫీజు రాయితీలంటూ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎరవేస్తున్నాయి. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ‘మా ర్యాంకులు ఇవి’ అంటూ ప్రచార యుద్ధానికి దిగాయి. మరోవైపు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ఇళ్లకు వెళ్తూ అడ్మిషన్లకు ప్రయత్నిస్తున్నారు.

News April 15, 2026

ఇంటర్నేషనల్ రేంజ్‌లో మన IIT HYD

image

IITH అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు సాధించింది. ఇంగ్లిష్ లిటరేచర్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయోలాజికల్ సైన్స్ వంటి సబ్జెక్టుల్లో అద్భుత ర్యాంకులు సాధించింది. వివిధ విభాగాల్లో 150- 600 మధ్య వరల్డ్ ర్యాంకులు పొందడం సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఉన్నత విద్య, పరిశోధనలో IITH స్థానం బలపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.