News April 13, 2026
భూపాలపల్లి: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఇంటర్ ఫలితాల్లో భూపాలపల్లి జిల్లాలో బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఈసారి ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 34 కళాశాలల్లోని ఫస్ట్ ఇయర్‌లో 1734 విద్యార్థులకు 1259 మంది, సెకండ్ ఇయర్‌లో 1740 మందికి 1439 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో గతేడాది 56% రాగా ఈ ఏడాది 73.03 % , సెకండ్ ఇయర్‌లో గత ఏడాది 72.07 శాతం, ఈఏడాది 82.34% మంది విద్యార్థులు పాసయ్యారు.
Similar News
News April 13, 2026
NGKL జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

NGKL జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 10,658 మంది విద్యార్థులకు గాను 10,637 మంది హాజరయ్యారని, 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 99.80 శాతం హాజరు నమోదైందని, పరీక్షల నిర్వహణలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన వెల్లడించారు.
News April 13, 2026
ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: ఎస్పీ

అమలాపురంలో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ రాహుల్ మీనా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అదనపు ఎస్పీ ప్రసాద్‌తో కలిసి మొత్తం 24 అర్జీలను స్వీకరించిన ఆయన, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు.
News April 13, 2026
ములుగు జిల్లాలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలు ఎక్కడంటే!

ములుగు జిల్లాలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. మంగళవారం రాయనిగూడెం మ.3గం, సర్వాపురం సా.6గం, బుధవారం రాజుపేట మ.3గం, మల్లూరు సా.6గ గ్రామాల్లో మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రజలు తమ సమస్యలు, పథకాల విన్నపాలు నేరుగా అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.


