News May 11, 2024
శ్రీకాకుళం: 1655 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు

జిల్లాలో 70.18 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని లైవ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని, మొత్తం 1655 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుందన్నారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ ఉండేలా పూర్తి చర్యలు తీసుకున్నామని అన్నారు.
Similar News
News November 6, 2025
ఏపీలో కొత్తగా 2 జిల్లాలు..మరి పలాస..?

APలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం 2 జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో పలాసను జిల్లాగా మార్చాలన్నా ప్రతిపాదనను పాలకులు పట్టించుకోలేదు. పునర్విభజనను కూటమి మళ్లీ తెరపైకి తేగా..నిన్న జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ప్రస్తావించకపోవడం ఉద్దానం వాసుల ఆశలను నీరుగార్చారు. మరో 2 రోజుల్లో రానున్న నివేదికలోనైనా తమ ప్రాంతం పేరు రావాలని ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.
News November 6, 2025
SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.
News November 5, 2025
SKLM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మందిరంలో జల్ జీవన్ మిషన్పై ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డిఈ కలెక్టర్కు వివరించారు.


