News May 11, 2024
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారు: అర్వింద్

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని, కనుక ప్రజల్లో మార్పు రావాలని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు. శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వ హించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో అరవింద్ మాట్లాడుతూ దేశ భద్రతపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని, ఈ విషయమై ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 28, 2026
NZB: ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలి: కలెక్టర్

ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, వారికి జవాబుదారీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. శనివారం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు నెల రోజుల లోపే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు.
News March 28, 2026
NZB: నగర పాలక సంస్థ 2026-2027 బడ్జెట్‌కు ఆమోదం

నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన అంచనా వ్యయం రూ. 24700.60 లక్షల బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2025 – 2026 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
News March 28, 2026
పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల, ఆర్మూర్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, తాగునీరు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్‌కు తావులేకుండా నిఘా ఉంచాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


