News April 13, 2026

నెల్లూరులో ఎమ్మెల్సీ vs మంత్రి..!

image

నెల్లూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్‌గా మారుతోంది. వైసీపీ సిటీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి వరుస ప్రెస్‌మీట్లతో మంత్రి నారాయణపై అవినీతి ఆరోపణలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్, మొక్కల పెంపకంలో రూ.కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు. దీనికి మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన అనుచరులే తిప్పికొడుతున్నారు. మంత్రి మౌనం ఎన్నిరోజులు అనేది ప్రశ్నార్థకం.

Similar News

News April 17, 2026

నెల్లూరులో అమ్మాయిల పేరుతో మోసం

image

నెల్లూరు నగరంలోని ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పేరుతో ఉన్న ఫేక్ ఐడి నుంచి మెసేజ్‌తోపాటు, కాల్ చేయగా అవతలి వ్యక్తి ఏడుస్తూ అత్యవసరంగా డబ్బులు కావాలని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి భావోద్వేగపూరితమైన మాటలతో మాయ చేస్తూ నగదు కాజేసే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. మీకు తెలిసిన వారు ఎవరైనా SM వేదికగా డబ్బులు అడిగితే పంపకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి.

News April 17, 2026

నెల్లూరులో స్పెషల్ ఆఫీసర్లు కనబడటం లేదు..!

image

సర్పంచుల పాలన ముగిసింది. వీరి స్థానంలో 376 మంది ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఇది జరిగి నేటికి 15 రోజులు పూర్తయినా ప్రత్యేకాధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు గందరగోలానికి గురవుతున్నారు. ఒక్కో అధికారికి 1 నుంచి రెండు పంచాయతీలు కేటాయించారు. చెక్ పవర్ కలిగిన వీరు గ్రామాల్లో కనిపించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. కొన్నిచోట్ల అధికారులు అందుబాటులో ఉండక పోవడంతో పల్లె పాలన పడకేస్తోంది.