News May 11, 2024

శ్రీకాళహస్తి : తగ్గేదే లే.. ఓటుకి రూ.2వేల నుంచి రూ.3వేలు!

image

ఎన్నికల ప్రచార గడువు ముగియనుండగా తాయిలాల పర్వానికి తెర లేచింది. నగదు పంపిణీకి ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. దీంతో శ్రీకాళహస్తిలో ఇప్పటికే చాలా చోట్ల డబ్బు పంచుతున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలైన కూటమి, వైసీపీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకు టీడీపీ రూ.2వేలు ఇస్తుంటే, దానికి పైచేయిగా YCP రూ.3 వేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News

News March 26, 2026

చిత్తూరు: సరదా మాటున ప్రమాదం.. జాగ్రత్త.!

image

వేసవి, ఒంటిపూట బడులు కావడంతో పలువురు చిన్నారులు, యువకులు చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు సరదా చూపుతున్నారు. వీరిని చూసి ఈతరాని వారు కూడా నీళ్లల్లోకి దిగుతుండడంతో మృత్యువాత పడే అవకాశం ఉంది. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు ఈత నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు ఎక్కడికి వెళుతున్నారో తల్లితండ్రుల పర్యవేక్షణ తప్పక ఉండాలన్నారు. ఈత రానివారు నీరు ఉన్న చోట్లకు వెళ్లకుండా అప్రమత్తత వహించాలన్నారు.

News March 26, 2026

చిత్తూరు: ఆ ఇద్దరు MLAలకు కొత్త టెన్షన్.?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన రెండు రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో గుబులు రేపుతోంది. సత్యవేడు, పూతలపట్టు, GDనెల్లూరు నియోజకవర్గాలు SC రిజర్వేషన్‌లో ఉన్నాయి. వీటిలో పూతలపట్టు, సత్యవేడు జనరల్‌కు కేటాయించే అవకాశం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టే సత్యవేడులో TDP ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌ శంకర్ రెడ్డి చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

News March 26, 2026

జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జనగణన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మూడు రోజుల జనగణన శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కుప్పం, పలమనేరు, నగరి డివిజన్లకు సంబంధించిన ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 15 సంవత్సరాల వరకు ఈ జనగణన ప్రభావం చూపుతుందన్నారు.