News May 11, 2024

ఆధ్యాత్మిక క్షేత్రంలో బీజేపీ వెలుగొందుతుందా?

image

AP: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రం కలిగి ఉన్న ప్రాంతం తిరుపతి పార్లమెంట్. గతంలో ఇక్కడ ఏకంగా 12 సార్లు కాంగ్రెస్ నెగ్గింది. 2014 నుంచి YCP పాగా వేసింది. సిట్టింగ్ MP మద్దిల గురుమూర్తిని బరిలోకి దింపింది. పొత్తులో భాగంగా ఇక్కడ BJP బరిలో నిలిచింది. YCP గూడురు MLA వరప్రసాద్‌ BJPలో చేరి టికెట్ దక్కించుకున్నారు. రాయలసీమలో కీలకమైన ఈ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటుతుందో? లేదో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News February 2, 2026

వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

image

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.

News February 2, 2026

ఏ గ్రహానికి ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం?

image

ఆదిత్యుడు – గోధుమలు, రవ్వ చక్కెర పొంగి
చంద్రుడు – పెరుగన్నం
అంగారకుడు – కందిపప్పు అన్నం
బుధుడు – పెసరపప్పు అన్నం
గురు – సెనగపప్పు అన్నం
శుక్రుడు – చిక్కుడు గింజల అన్నం
శని – నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు – మినుములతో కూడిన అన్నం
కేతువు – ఉలవల అన్నం

News February 2, 2026

WPL: ఢిల్లీ కల సాకారమయ్యేనా!

image

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు స్థిరమైన ప్రదర్శనతో కొనసాగుతోంది. వరుసగా నాలుగు సీజన్లలో ప్లేఆఫ్ చేరిన జట్టుగా DC నిలిచింది. గత మూడు సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లింది. రేపు గుజరాత్ జెయింట్స్‌తో జరిగే ఎలిమినేటర్‌లో విజయం సాధిస్తే వరుసగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన జట్టుగానూ నిలవనుంది. ఫైనల్లో ఆర్సీబీపై గెలిస్తే తొలి సారి విజేతగా నిలవాలనే కల సాకారం కానుంది.