News April 13, 2026

KMM: చింతకానికి రూ.22.75 కోట్లతో రోడ్ల మంజూరు

image

చింతకాని మండలంలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి రూ.22.75 కోట్ల నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకుడు అంబటి వెంకటేశ్వరరావు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో ఆరు ప్రధాన లింక్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం లభించిందన్నారు. ఇందులో తిమ్మినేనిపాలెం, మత్కేపల్లి, అల్లిపురం గ్రామాల మధ్య రహదారులు మెరుగుపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ప్రజల ఇబ్బందులు తొలగుతాయన్నారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.