News May 11, 2024

పిఠాపురంలోకి జగన్ ENTRY

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పిఠాపురం చేరుకున్నారు. ప్రచారంలో చివరి సభ కావడంతో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ నేపథ్యంలో ఆయనపై ఏమైనా విమర్శలు చేస్తారా అన్నదానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News July 7, 2025

2047 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తాం: మంత్రి కందుల

image

ఆంధ్రప్రదేశ్ విజన్ యాక్షన్ ప్లాన్-2047లో భాగంగా ఉపాధి, సాంఘిక గౌరవం, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రూపొందించిన P-4 కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలులో మంత్రి మాట్లాడారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో P-4 రూపొందించినట్లు చెప్పారు.

News July 7, 2025

రాజమండ్రి: ఈ నెల 12 వరకు రాబిస్ వ్యాధి నివారణ డ్రైవ్

image

జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5- 12వ తేదీ వరకు రాబిస్ వ్యాధి నివారణ డ్రైవ్ నిర్వహించినట్లు DMHO వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమండ్రిలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిల్లో 12వ తేదీ వరకు ఉచితంగా రాబిస్ వ్యాక్సిన్ అందిస్తారన్నారు. కుక్క కాటుకి గురైన వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు వ్యాక్సిన్‌తో రాబిస్ నుంచి రక్షణ పొందవచ్చు అన్నారు.

News July 7, 2025

రాజమహేంద్రవరం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

image

నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథావిధిగా కలెక్టరేట్‌లో జరుగుతుందని జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమస్యలపై ఫిర్యాదులను అందించేందుకు వాట్సాప్ గవర్నెస్ నంబర్ 95523 00009 ద్వారా పౌర సేవలు పొందవచ్చు అన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సోమవారం పీజిఆర్ఎస్ ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వినతుల స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చున్నారు.