News May 11, 2024
BREAKING: మంచిర్యాల.. ముగిసిన ప్రచారం

మంచిర్యాల జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముగించారు. గత కొన్నిరోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసేందుకు కష్టపడుతూ.. ఓటును అభ్యర్థించారు. కొన్ని రోజులుగా మైకులతో మార్మోగిన ఈ ప్రాంతాలు ఈ సాయంత్రం 4 తర్వాత మైకులు మూగబోయాయి. కాగా ఈ నెల 13 ఓటింగ్ జరగనుండగా..వచ్చే నెల 4న వారి భవితవ్యం తేలనుంది.
Similar News
News March 24, 2026
ఆదిలాబాద్: ఈ నెల 31న జాబ్ మేళా

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైనా వారికీ నెలకు రూ.18-20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20సం.ల నుంచి 28సం.లలోపు గల యువకులు B.Sc / B.Com /BA (Fresher’s) వారు అర్హులని వివరించారు.
News March 24, 2026
ADB: క్రెడిట్ కోసం నిధుల యుద్ధం

ఆదిలాబాద్ జిల్లాలో నిధుల రాజకీయం సెగలు పుట్టిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి పనుల క్రెడిట్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. “నిధులు మేమే తెచ్చాం” అంటూ ఇరువర్గాలు పోటాపోటీగా శంకుస్థాపనలు చేస్తున్నాయి. ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు మండిపడుతుండగా, ప్రభుత్వ నిధులతోనే పనులు జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
News March 24, 2026
నిర్మల్: కొయ్యబొమ్మలకు జీవం పోసేలా..?

నిర్మల్ జిల్లా గర్వకారణమైన కొయ్యబొమ్మల కళకు పూర్వవైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ‘పొనికి’ కర్ర కొరతతో ఈ పరిశ్రమ సంక్షోభంలో పడటంతో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో ఉపాధి హామీ పథకం ద్వారా ఎర్రమట్టి నేలల్లో పొనికి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో వీటిని పెంచడం ద్వారా కళాకారులకు ముడిసరుకు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యం.


