News May 11, 2024
తిరుపతిలో సాయంత్రం 6 గంటల నుంచి 141 సెక్షన్

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 141 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సుమారు 5వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 19, 2026
తిరుపతి బస్టాండ్‌లో ఒకే రోజు 24 సెల్ ఫోన్లు చోరీ

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దొంగలకు నిలయంగా మారింది. రద్దీని దొంగలు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో బుధవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించి 24 సెల్ ఫోన్లు దొంగలించారు. తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన అనూష రాజంపేటకు వెళ్లేందుకు బస్టాండ్‌కు రాగా 150 గ్రా. బంగారు నగల బ్యాగు చోరీకి గురైంది.
News March 18, 2026
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. పాకాల(M) దామలచెరువుకు చెందిన శిరీష, విజయ్ దంపతులకు నెలలు నిండకుండా పాప పుట్టింది. పాలు సరిగ్గా తాగకకపోవడం, తల అసాధారణంగా పెరగడం, తరచూ మూర్చ రావడం వంటి లక్షణాలతో బాధ పడుతుంటేది. తలలో రక్త స్రావం, నీరు చేరినట్లు గుర్తించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి నేతృత్వంలో బ్రెయిన్ ఆపరేషన్ చేసి చిన్నారిని కాపాడారు.
News March 18, 2026
కేంద్ర మంత్రిని కలిసిన రోజా

నగరి నియోజకవర్గ సమస్యలను కేంద్రమంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని తొలగించేలా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుపోయారు. కొండచుట్టూ మండప ప్రాధాన్యాన్ని తెలియజేసి, వాటిని కాపాడేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.


