News May 11, 2024
కృష్ణా: అభ్యర్థుల ప్రచారానికి సమయం ముగుస్తోంది

గత నెల రోజులుగా వివిధ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార పర్వాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మాత్రమే ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈసీ ఆదేశాల ప్రకారం ప్రకారం.. నేటి సాయంత్రం 5 గంటలకే అభ్యర్థులు తమ, తమ ప్రచార పర్వాన్ని ముగించాలన్నారు. అందుకు సమయం ఆసన్నమైందని తెలిపారు. సమయానికి మించి ప్రచారం చేస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు అభ్యర్థులు బాధ్యులవుతారని హెచ్చరించారు.
Similar News
News July 10, 2025
గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్‌కి తల్లి వినతి

ఉద్యోగాల కోసం ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్న తన ఇద్దరి కుమారులను రక్షించాలంటూ సూర్యకుమారి Dy.CM పవన్‌ని గన్నవరం ఎయిర్‌పోర్టులో గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, విదేశాల్లో ఉన్నవారిని తిరిగి రప్పిస్తానని అన్నారు.
News July 10, 2025
మచిలీపట్నం: 11న ‘వార్తాలాప్’ జర్నలిస్ట్‌లకు వర్క్ షాప్

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మచిలీపట్నంలో జర్నలిస్టులకు ‘వార్తాలాప్’ మీడియా వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు PIB డైరెక్టర్ రత్నాకర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వలందపాలెంలోని G కన్వెన్షన్‌లో నిర్వహించే ఈ వర్క్ షాప్‌కు మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ వర్క్ షాప్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
News July 10, 2025
కృష్ణా: గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు

ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలజీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా నమోదై, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ఈ పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.