News May 11, 2024
కర్నూల్: ప్రచారం CLOSE

ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది.
☛ ఓటు హక్కు వినియోగించుకుందాం.. సరైన నాయకుడిని ఎన్నుకుందాం.
Similar News
News November 5, 2025
ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో ముమ్మర తనిఖీలు

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాత్రి పూట నడిచే ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, భద్రతా పరికరాలు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News November 5, 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


