News May 11, 2024
సంక్షేమ కార్యక్రమాలు రెండింతలు చేస్తా: చంద్రబాబు

AP: బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసింది ఎవరో సీఎం జగన్‌కు తెలియదటని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చిత్తూరులో మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకులకు నీతి, నిజాయితీ ఉండాలి. నేరాలు, హత్యా రాజకీయాలకు నేను దూరం. తప్పులు చేసినవారిని వదిలిపెట్టను. ఎన్నికల్లో మభ్యపెట్టేవారిని ఓడించాలి. మేం వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు రెండింతలు చేస్తా. యువతకు ఉద్యోగాలు కల్పిస్తా. పేదలు, రైతులను ఆదుకుంటా’ అని హామీ ఇచ్చారు.
Similar News
News March 14, 2025
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంల హోలి విషెస్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని CBN ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించవద్దని సూచించారు.
News March 14, 2025
కాల్పుల విరమణకు పుతిన్ ఒకే.. కానీ

ఉక్రెయిన్‌తో యుద్ధంలో 30 రోజుల పాటు <<15729985>>కాల్పుల విరమణకు<<>> రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. కాల్పుల విరమణకు అనుకూలమేనని అంటూ చిన్నచిన్న విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయమై మధ్యవర్తిత్వం చేస్తున్న యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసి మాట్లాడుతామని చెప్పారు. ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా ముగించే ఆలోచనకు మద్దతిస్తామని పేర్కొన్నారు.
News March 14, 2025
హోలి: ఈ జాగ్రత్తలు పాటించండి

హోలి అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.