News May 11, 2024
గుంటూరు: ప్రచారం CLOSE

ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు దాదాపు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది. ఓటు హక్కు వినియోగించుకుందాం.. సరైన నాయకుడిని ఎన్నుకుందాం.
Similar News
News March 25, 2026
ఉండవల్లి: మంత్రి లోకేశ్‌ను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు

ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌ను ఏపీ జేఏసీ ఛైర్మన్, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ బుధవారం కలిశారు. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం పట్ల మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రుల బృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జేఏసీ నేతలు స్వాగతించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
News March 25, 2026
వెలగపూడి: వ్యవసాయంపై సింగపూర్‌తో మంత్రి అచ్చెన్న చర్చలు

వ్యవసాయ రంగంపై సింగపూర్ ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలు, ఎగుమతులపై ప్రధానంగా చర్చించారు. సింగపూర్ అమలు చేస్తున్న డేటా ఆధారిత పాలసీలు, కోల్డ్ స్టోరేజ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో మత్స్య, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఈ చర్చలతో వ్యవసాయంలో సాంకేతిక సహకారం మరింత పెరుగుతుందన్నారు.
News March 25, 2026
సింగపూర్ బృందంతో మంత్రి నాదెండ్ల భేటీ

అమరావతి సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో సింగపూర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధిని మంత్రి వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై ఇరువర్గాలు చర్చించాయి. భేటీలో సివిల్ సప్లైస్ డైరెక్టర్ నుపూర్, సింగపూర్ అధికారులు పాల్గొన్నారు. ఈ చర్చలతో రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం మరింత పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


