News May 11, 2024
త్వరలో హీరో రామ్ పోతినేని వెబ్‌సిరీస్?

హీరో రామ్ పోతినేని OTTలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయనతో వెబ్‌సిరీస్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని టాలీవుడ్ టాక్. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’లో నటిస్తోన్న రామ్.. ఈ నెల 15న తన పుట్టినరోజు సందర్భంగా మరో సినిమాను ప్రకటిస్తారని సమాచారం.
Similar News
News November 7, 2025
264 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

AP: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీఎస్పీలో 19 SI, 245 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27లో 10 SI, 125 కానిస్టేబుల్, 2027-28లో 9 SI, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసు నియామక మండలికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
News November 7, 2025
ఏటా 5-10% పెరగనున్న ఇళ్ల ధరలు

ప్రస్తుతం దేశంలో ఏటా ఇళ్ల అమ్మకాలు 3-4L యూనిట్లుగా ఉండగా 2047 నాటికి రెట్టింపవుతాయని CII, కొలియర్స్ ఇండియా అంచనా వేశాయి. భారీ డిమాండ్ వల్ల 2 దశాబ్దాలపాటు ఏటా 5-10% మేర గృహాల రేట్లు పెరుగుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $0.3 ట్రిలియన్లుగా ఉండగా 2047కు $5-10 ట్రిలియన్లకు పెరగొచ్చని తెలిపాయి. మౌలిక వసతులు, రవాణా, వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాయి.
News November 7, 2025
NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


