News May 11, 2024
IPL… DC కెప్టెన్‌గా అక్షర్ పటేల్

రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ పడటంతో తమ జట్టు కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తున్నట్లు DC యాజమాన్యం ప్రకటించింది. రేపు RCBతో జరిగే మ్యాచ్‌లో జట్టును అక్షర్ నడిపిస్తారని వెల్లడించింది. కాగా స్లో ఓవర్ రేటు కారణంగా రిషబ్ పంత్‌పై ఒక్క మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు రూ.30లక్షల ఫైన్ విధిస్తూ ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
Similar News
News January 7, 2026
గ్రీన్లాండ్ కావాల్సిందే.. అవసరమైతే సైన్యాన్ని వాడతామన్న US

గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడం తమకు చాలా ముఖ్యమని అమెరికా తేల్చి చెప్పింది. అవసరమైతే సైన్యాన్ని వాడతామని వైట్ హౌస్ హెచ్చరించడం సంచలనం రేపుతోంది. రష్యా, చైనాలను అడ్డుకోవడానికి ఈ ద్వీపం తమకు అవసరమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్, ఐరోపా దేశాలు స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని యూరప్ నేతలు అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
News January 7, 2026
మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం!

TG: మేడారం మహా జాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనకు ఆహ్వానపత్రిక అందజేయనున్నట్లు సమాచారం. అటు జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని సీతక్క కోరారు. నిన్న అసెంబ్లీ వద్ద వారికి ఇన్విటేషన్లు ఇచ్చారు. కాగా ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది.
News January 7, 2026
రేపట్నుంచి ‘ఆవకాయ-అమరావతి’ ఉత్సవాలు

AP: ‘ఆవకాయ-అమరావతి’ పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో రేపట్నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలను చాటిచెప్పేలా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి పున్నమి ఘాట్ వద్ద జరిగే ప్రారంభోత్సవంలో CM CBN, Dy.CM పవన్ పాల్గొననున్నారు.


