News May 11, 2024
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శనివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈనెల 13వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో జరగనున్న పోలింగ్ కోసం బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 15, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి ఒంటి పూట బడులు

వేసవ తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.
News March 15, 2026
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

శ్రీకాకుళం జిల్లాలో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విస్తృతంగా హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు హోటల్స్‌లో వినియోగిస్తే సీజ్ చేస్తున్నారు. దీంతోపాటు భారీగా ఫైన్ వేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ అక్రమ వినియోగం వల్ల గ్యాస్ కొరత సమస్యగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
News March 15, 2026
శ్రీకాకుళం: కాసులు కురిపిస్తున్న మొగలిరేకులు

శ్రీకాకుళంలోని ఉద్దానంలోని “మొగలి” డొంకలు సహజ రక్షణ కవచంలా తీరప్రాంతాన్ని కాపాడటంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు చక్కని ఆదాయం వనరుగా మారాయి. దట్టంగా పెరుగుతూ సహజ రక్షణ గోడగా నిలుస్తూ తీరప్రాంతాన్ని తుపాన్ల నుంచి కాపాడుతున్నాయి. మొగలిరేకులు నుంచి తయారుచేసే అత్తరుకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో సీజన్లో కొన్ని కుటుంబాలు ఈ అత్తరు తయారిని కుటీర పరిశ్రమగా నిర్వహించి, మంచి ఆదాయం సంపాదిస్తున్నాయి.


