News May 11, 2024

వర్షంతో KKRvsMI టాస్ ఆలస్యం

image

ఈడెన్ గార్డెన్స్‌లో KKRvsMI మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. జోరుగా వాన పడుతుండటంతో గ్రౌండ్‌ను కవర్లతో కప్పేశారు. దీంతో ఆలస్యంగా టాస్ వేయనున్నారు.

Similar News

News December 27, 2025

పదేళ్లలో బంగారంపై 400%, వెండిపై 500% రిటర్న్స్!

image

పదేళ్లలో ఇన్వెస్ట్‌మెంట్లపై వచ్చిన రాబడులను గమనిస్తే బంగారం, వెండి మంచి లాభాలను అందించాయి. బంగారం 400% రిటర్నులతో దూసుకుపోగా, వెండి ఏకంగా 500% లాభాన్ని ఇచ్చింది. మన స్టాక్ మార్కెట్ NIFTY 50 కూడా 230% రాబడితో స్థిరంగా రాణించింది. అత్యధికంగా బిట్‌కాయిన్ $305 నుంచి $80,000కు చేరుకుని దాదాపు 30,000% రాబడిని ఇచ్చింది.

News December 27, 2025

క్యాబేజీ నాటే విధానం – యాజమాన్యం

image

క్యాబేజీ విత్తనాలు నాటే ముందు నేలను 4-5 సార్లు.. 100 చ.మీ. విస్తీర్ణంలో 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పి అవి మొలిచే వరకు రోజూ నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తాక ఎండిన ఆకులను తీసేయాలి. నారు కుళ్లు తెగులు సోకకుండా లీటరు నీటికి 3గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌తో నేలను తడపాలి. ఆకుతినే పురుగు నుంచి నారు రక్షణకు లీటరు నీటికి మలాథియాన్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News December 27, 2025

5 రోజుల్లో 5,000 కిలోమీటర్లు

image

వలస పక్షుల్లో అముర్ ఫాల్కన్లు (డేగలు) ఎంతో ప్రత్యేకం. మణిపుర్ నుంచి బయలుదేరిన 3 ఫాల్కన్లు (అపపాంగ్, అలాంగ్, అహు) 5 రోజుల్లో 5,000 KMకు పైగా ప్రయాణించి దక్షిణాఫ్రికా చేరుకున్నాయి. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నిర్వహించిన శాటిలైట్ ట్రాకింగ్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇవి అరేబియా సముద్రాన్ని దాటి ప్రయాణించాయి. కేవలం 160-200 గ్రాములుండే ఈ పక్షులు రోజుకు 1000KM వరకు ప్రయాణించగలవు.