News May 11, 2024

ఏపీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే?

image

APలోని 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా విశాఖ లోక్‌సభ బరిలో 33 మంది పోటీలో ఉండగా.. అత్యల్పంగా రాజమండ్రి లోక్‌సభ స్థానంలో 12 మంది పోటీ చేస్తున్నారు. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ చేస్తుండగా.. అత్యధికంగా తిరుపతిలో 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీ చేస్తున్నారు. 4.14 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని EVMలలో ఎల్లుండి నిక్షిప్తం చేయనున్నారు.

Similar News

News January 10, 2025

‘స్వలింగ వివాహాల’పై తీర్పు కరెక్టే: సుప్రీంకోర్టు

image

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత నిరాకరిస్తూ తామిచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తీర్పులో ఎలాంటి తప్పు కనిపించనందున జోక్యం అవసరం లేదని భావిస్తున్నట్లు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ వివాహాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని 2023 అక్టోబర్‌లో జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

News January 10, 2025

విడాకుల ప్రచారంపై స్పందించిన చాహల్

image

భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా వస్తున్న వదంతులపై భారత క్రికెటర్ చాహల్ స్పందించారు. ఈమేరకు అభిమానులకు ఇన్‌స్టాలో ఓ లేఖ రాశారు. ‘నాకు ఇస్తున్న మద్దతుకు నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ మద్దతుతోనే ఇంతటివాడ్ని అయ్యాను. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. నా వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని అర్థం చేసుకోగలను. కానీ దయచేసి ఆ విషయంలో సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయొద్దు’ అని కోరారు.

News January 9, 2025

అందుకే బీర్ల తయారీని నిలిపేస్తున్నాం: UBL

image

TG: రాష్ట్రంలో బీర్ల తయారీని నిలిపేయడానికి గల కారణాలపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ మరోసారి వివరణ ఇచ్చింది. ‘బీరు తయారీ ముడిసరకు ధరలు పెరిగాయి. బీరు ధరలో తయారీ రేటు 16 శాతం కాగా ప్రభుత్వ పన్నులు 70 శాతం ఉంటాయి. మాకు సర్కారు నుంచి సకాలంలో <<15107893>>చెల్లింపులు<<>> జరగట్లేదు. నష్టాలు భరించలేక బీర్ల సరఫరా ఆపేస్తున్నాం’ అని పేర్కొంది.