News May 11, 2024
PM పీఠంపై.. కేజ్రీవాల్ Vs అమిత్‌షా

ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చే సెప్టెంబర్‌లో 75 ఏళ్లు నిండుతున్నాయని, ఆ తర్వాత ఎవరు ప్రధాని అవుతారని AAP కన్వీనర్ కేజ్రీవాల్ బీజేపీని ప్రశ్నించారు. 75ఏళ్లు నిండిన వారు పదవీ విరమణ చేయాల్సిందేనని రూల్ చేసింది ఆయనేనని గుర్తు చేశారు. అయితే.. మోదీ తన వారసుడిగా అమిత్‌షానే కావాలని కోరుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. కాగా.. 75ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారని షా బదులిచ్చారు.
Similar News
News April 18, 2026
సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్‌ఫెక్ట్‌గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్‌తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?
News April 18, 2026
రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.
News April 18, 2026
హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.


