News May 11, 2024
లోక్‌సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు సిద్ధం: రాహుల్

లోక్‌సభ ఎన్నికలపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రధాన పార్టీల చర్చను కాంగ్రెస్ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. ఈ చర్చలో దేశ ప్రధాని పాల్గొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ చొరవ తీసుకున్నవారికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు బహిరంగ చర్చకు రావాలని PM మోదీకి, రాహుల్ గాంధీకి రిటైర్డ్ జడ్జిలు, ప్రముఖులు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 24, 2026
ఇరాన్-US చర్చలకు సిద్ధమన్న పాక్.. స్పందించిన ట్రంప్!

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిపై పాక్ PM షరీఫ్ చేసిన ట్వీట్‌ను US అధ్యక్షుడు ట్రంప్ రీపోస్ట్ చేశారు. పరోక్షంగా పాక్ రిక్వెస్ట్‌ను స్వాగతించారు. మరోవైపు ఇస్లామాబాద్‌కు US ఉపాధ్యక్షుడు JD వాన్స్ వెళ్తున్నట్లు Axios మీడియా సంస్థ తెలిపింది. అక్కడ ఇరాన్ ప్రతినిధులతో విట్కాఫ్, కుష్నెర్‌తో కలిసి చర్చల్లో పాల్గొంటారని వెల్లడించింది.
News March 24, 2026
మన దగ్గర ఎన్నిరోజులకు సరిపడా ఇంధనం ఉందంటే..

దేశంలో దిగుమతులకు అంతరాయం ఏర్పడితే మన క్రూడాయిల్ రిజర్వులు(100% కెపాసిటీ) 9.5 రోజులకే సరిపోతాయని కేంద్రం వెల్లడించింది. వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు(SPR)ల్లో 33.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ నిల్వ ఉందని తెలిపింది. APలోని విశాఖ, KAలోని మంగళూరు, పాదూర్‌లో ఈ రిజర్వులు ఉన్నట్లు వివరించింది. వీటి మొత్తం కెపాసిటీ 53.3L MT అని పేర్కొంది. RTI ద్వారా India Today అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.
News March 24, 2026
యుద్ధం.. బీర్లు తాగేవారికి షాక్!

దేశంలో బీర్ల ధరలు పెరుగుతాయని, సరఫరాకు కొరత ఏర్పడొచ్చని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(BAI) తెలిపింది. ‘యుద్ధం వల్ల తయారీ ఖర్చు 12-15% పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ధరలు ఉన్నాయి’ అని పేర్కొంది. సీసాల ధరలు 20%, మెటీరియల్స్ రేట్లు 20-25%, రవాణా ఖర్చులు 10% పెరిగాయి. BAIలోని యునైటెడ్ బ్రూవరీస్, కార్ల్స్‌బర్గ్, AB InBev తదితర కంపెనీలు దేశంలో 85% బీర్లు అమ్ముతున్నాయి.


