News May 11, 2024
IPL: కేకేఆర్ బ్యాటింగ్.. జట్లు ఇవే..

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ KKRతో జరుగుతున్న మ్యాచులో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను అంపైర్లు 16 ఓవర్లకు కుదించారు.
MI: ఇషాన్, నేహల్ వధేరా, నమన్ ధీర్, సూర్యకుమార్, తిలక్‌వర్మ, పాండ్య(C), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, చావ్లా, బుమ్రా, నువాన్ తుషార.
KKR: సాల్ట్, నరైన్, నితీశ్ రాణా, శ్రేయస్, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమన్‌దీప్, స్టార్క్, చక్రవర్తి, హర్షిత్.
Similar News
News January 20, 2026
కొత్తగూడెం మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు..!

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఆ పీఠం కోసం నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ నుంచి మేయర్ దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైరా ఎమ్మెల్యే టికెట్ ఆశించిన విజయ బాయి, కొత్తగూడెం డాక్టర్ బీఎస్ రావు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న డాక్టర్ శంకర్ నాయక్ సతీమణి డా.స్వప్న ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
News January 20, 2026
నితీష్ ఫెయిలైనా అవకాశాలివ్వాలి: ఇర్ఫాన్ పఠాన్

NZతో జరిగిన మూడో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ నితీష్‌ను హార్దిక్ పాండ్యాకు సరైన బ్యాకప్‌గా అభివర్ణించారు. 135km వేగంతో బౌలింగ్, భారీ షాట్లు కొట్టగల బ్యాటింగ్ సామర్థ్యం అతనికి ఉందన్నారు. వరుసగా ఫెయిలైనా మరిన్ని అవకాశాలివ్వాలని సూచించారు. కోహ్లీతో కలిసి నితీష్ నెలకొల్పిన 88 పరుగుల భాగస్వామ్యం అతని టాలెంట్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.
News January 19, 2026
రేపు ఆటోల బంద్.. క్లారిటీ

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.


