News May 11, 2024
కుంటాల మండలంలో గుర్తు తెలియని మృతదేహం

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు వెనకాల ఒక గుర్తు తెలియని మృతదేహనం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై రజనీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సుమారు 50 నుంచి 55 సం.ల వయసు ఉంటుందని, నల్లని ప్యాంటు, పసుపు రంగు షర్టు ధరించాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 8712659535,8712659534 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.
Similar News
News February 24, 2026
నేడు ఆదిలాబాద్‌కు కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను 11 గంటలకు ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు.
News February 23, 2026
ఆదిలాబాద్‌లో తిరిగి ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ గోడం నాగేష్ జోక్యంతో పునఃప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ, అధికారులతో మాట్లాడి ప్రక్రియను పునరుద్ధరించారు. తమకు అండగా నిలిచిన నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
News February 23, 2026
ఆదిలాబాద్: 67 మంది దరఖాస్తు.. కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు

అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘రేవంత్ అన్న కా సహారా – మిస్కినో కే లియే’ పథకం కింద సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ సెలెక్షన్ కమిటీ (DLSSC) సమక్షంలో మోపెడ్ వాహనాల పంపిణీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈపథకానికి మొత్తం 67 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.


