News May 11, 2024

అద్భుతం.. తిండి, నీళ్లు లేకుండా 5 రోజులు బతికాడు

image

దక్షిణాఫ్రికాలో ఓ వ్యక్తి మృత్యువును జయించాడు. ఈ నెల 6న నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోగా, శిథిలాల్లో ఇరుక్కుపోయిన అతడిని 5 రోజుల తర్వాత రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కాలిపై బరువైన శిథిలం పడటంతో అతను కదలకుండా ఉండిపోయాడని అధికారులు తెలిపారు. 116 గంటలపాటు తిండి, నీళ్లు లేకుండా జీవించడం అద్భుతమంటున్నారు. కాగా బిల్డింగ్ కూలిన ఘటనలో 13 మంది మరణించారు.

Similar News

News March 20, 2026

ఇక్కడి LPG మన అవసరాలకే: హైకోర్టు

image

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఉత్పత్తి చేసే LPGని దేశీయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని AP హైకోర్టు ఆదేశించింది. లేదంటే సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాన్ఫిడెన్స్ పెట్రోలియం LPGని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

News March 20, 2026

అకాల వర్షాలు.. పంట నష్టంపై రైతుకు భరోసా!

image

AP: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీసత్యసాయి, NTR, అనంతపురం, మన్యం జిల్లాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు CM దృష్టికి తెచ్చారు. వాతావరణ పరిస్థితులపై రైతులను అప్రమత్తం చేయాలని CBN సూచించారు. మరోవైపు పంట నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్న భరోసా ఇచ్చారు.

News March 20, 2026

గల్ఫ్‌కు US ₹1.5 లక్షల కోట్ల ఆయుధాలు

image

UAE, కువైట్‌కు దాదాపు ₹1.5 లక్షల కోట్ల మిలిటరీ సేల్స్‌కు US ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మిస్సైల్, డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్‌, మిస్సైల్స్, F-16 యుద్ధ విమానం కోసం వివిధ రకాల ఆయుధాలను అమ్మనుంది. US, ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో ఇరాన్ ఈ 2 దేశాల్లోని అమెరికా బేస్‌లను టార్గెట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో కొన్ని ఆయిల్, గ్యాస్‌ ఫీల్డ్‌లూ లక్ష్యంగా మారుతున్నాయి.