News May 12, 2024
TODAY HEADLINES

* తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచార పర్వం
* AP: వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తా: జగన్
* సంక్షేమ కార్యక్రమాలు రెండింతలు చేస్తా: చంద్రబాబు
* TG: ఒవైసీతో మోదీ డీల్: రేవంత్
* నేనూ ప్రధాని రేసులో ఉన్నా: కేసీఆర్
* భారత్ జోడో యాత్రకు వైఎస్సారే స్ఫూర్తి: రాహుల్
* మోదీ తర్వాతి టార్గెట్ యోగి: కేజ్రీవాల్
Similar News
News January 14, 2026
సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు కచ్చితంగా ఉండాలా?

ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండటం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది ఇంటికి అందంతో పాటు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చేస్తుందంటున్నారు. ‘మిగిలిన 3 దిక్కులలో ఒక్కో ద్వారం ఉంటే సరిపోతుంది. పెద్ద ఇళ్లకు 4 వైపులా ద్వారాలు ఉండటం ఉత్తమం. మారుతున్న చిన్న కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా కిటికీలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 14, 2026
ఇంట్రెస్టింగ్ మ్యాచ్.. ఎవరు గెలుస్తారో?

భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 28 ఓవర్లలో 134/2 రన్స్ చేసింది. మిచెల్, యంగ్ హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ విజయానికి మరో 132 బంతుల్లో 151 రన్స్ అవసరం. ప్రసిద్ధ్, హర్షిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News January 14, 2026
ఆమెకి రెండు యోనులు, రెండు గర్భాశయాలు

పుట్టుకతో రెండు యోనులు, రెండు గర్భాశయాలతో జన్మించిన యూపీలోని బల్లియా(D) యువతికి లక్నో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఆమెకి చిన్నప్పటి నుంచి మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండేది కాదని, మలవిసర్జనలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు డాక్టర్లు తెలిపారు. మూత్ర నాళాలు అసాధారణ ప్రదేశాలలో తెరుచుకోవడంతో మూత్రం లీక్ అయ్యేదని పేర్కొన్నారు. 3 సర్జరీలు చేసి ఈ అరుదైన సమస్యను పరిష్కరించారు.


