News May 12, 2024

KNR: ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారుల థర్డ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.

Similar News

News April 3, 2026

హనుమాన్ జయంతి.. కరీంనగర్‌లో ప్రశాంతం

image

హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీ పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. సీపీ గౌష్ ఆలం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ర్యాలీ ప్రశాంతంగా సాగింది.

News April 3, 2026

కరీంనగర్: 50 శాతం పెరిగిన చార్జీలు

image

మీసేవ కేంద్రాల్లో ధృవీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపులపై యూజర్ చార్జీలు 50 శాతం పెంచుతూ ఐటీ, కమ్యూనికేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.45–55 మధ్య ఉన్న సర్టిఫికెట్ ధరలు ప్రస్తుతం రూ.80కి పెరుగగా, సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 190 కిపైగా కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు 25 మంది దాకా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేస్తుండగా, ఎక్కువ మంది విద్యార్థులే కావటం గమనార్హం.

News April 2, 2026

హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: కౌశిక్ రెడ్డి

image

శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ మండలం రాజపల్లి, సిర్సపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు సర్పంచ్‌‌లు కటుకూరి మల్లారెడ్డి, పోల్సాని రామారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.