News May 12, 2024
ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శివాని ఇంజినీరింగ్ కళాశాలలో రిసెప్షన్ కేంద్రంలో ట్రయిల్ రన్‌ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్ శనివారం రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రతీ ఒక్క సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేశారని సూచించారు.
Similar News
News January 6, 2026
SKLM: క్రీడలు, మైదానాల అభివృద్ధి సహకరించండి

శ్రీకాకుళం జిల్లాలో క్రీడలు, మైదానాల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందివ్వాలని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. మంగళవారం ఆయనతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. పాత్రునివలస రెవెన్యూ పరిధిలో 33 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి ఆయనకు వివరించారు. మైదానాలు అభివృద్ధి చేయాలన్నారు.
News January 6, 2026
ఎస్సీ కులాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట: SKLM కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో షెడ్యూల్డు కులాల లబ్ధిదారులకు ఆర్థిక ఊరట కల్పిస్తూ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. NSFDC, ఎన్ఎస్కెఎఫ్డీసీ పథకాల కింద రుణాలు పొంది, వడ్డీ చెల్లించలేని వారి కోసం వడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 273 మంది లబ్ధిదారులకు రూ.180.70 లక్షలు వడ్డీ ప్రభుత్వం రద్దు చేస్తోందన్నారు.
News January 6, 2026
రోడ్డు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగం మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన జీ.నగేశ్ (30) అనే యువకుడు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి లగేజీ వ్యాన్‌పై టెక్కలి వైపు సామాగ్రి తీసుకువస్తుండగా రోడ్డుపక్కన బండి ఆపి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


