News May 12, 2024
స్ట్రాటజిక్ టైమ్ ఔట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం

నిన్న కోల్‌కతాలో కేకేఆర్, ముంబై మధ్య మ్యాచ్ వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. అసలు మొదలు కావడమే ఆలస్యమైన ఆ మ్యాచ్‌లో మళ్లీ స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌లను పెట్టారు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులపై ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైన మ్యాచ్‌కు మళ్లీ టైమ్ ఔట్‌లు పెట్టి ఇంకా లేట్ చేయడం ఏం సబబంటూ ప్రశ్నించారు. ఈరోజు తెల్లవారుఝాము 12.30 గంటల వరకు మ్యాచ్ సాగడం గమనార్హం.
Similar News
News January 16, 2026
SSC కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్

సాయుధ బలగాల్లోని 8 విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి SSC నిర్వహించిన కానిస్టేబుల్ జీడీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 53,690 పోస్టుల ఎంపికకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. గతేడాది ఫిబ్రవరిలో CBT నిర్వహించగా 24లక్షల మంది పాల్గొన్నారు. జూన్‌లో PET, PST, ఆగస్టు నుంచి SEP వరకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించారు. అఫీషియల్ <
News January 16, 2026
ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News January 16, 2026
యెమెన్ ప్రధాని సలేం బిన్ బ్రేక్ రాజీనామా

యెమెన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి సలేం బిన్ బ్రేక్ రాజీనామా చేయగా, విదేశాంగ మంత్రి షయా మొహ్సిన్ అల్ జిందానీ కొత్త PMగా నియామకం అయ్యారు. యెమెన్ పాలక ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ యెమెన్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల మధ్య ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.


