News May 12, 2024

రఫా నుంచి పౌరులు వెళ్లిపోవాలి: ఇజ్రాయెల్

image

గాజాలోని రఫా ప్రాంతంపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న పాలస్తీనా పౌరులందరూ గాజాలోని వేరే ప్రాంతాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఈమేరకు ఆ దేశ సైనిక ప్రతినిధి ట్విటర్‌లో సూచించారు. దీంతో ఎక్కడికెళ్లినా దాడులు తప్పడం లేదంటూ పాలస్తీనా పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత రాత్రి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 37మంది పౌరులు మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Similar News

News January 11, 2026

సారీ.. ఆ మెయిల్స్‌ను పట్టించుకోవద్దు: డేటా లీక్‌పై ఇన్‌స్టాగ్రామ్

image

యూజర్ల సెన్సిటివ్ <<18820981>>డేటా లీక్<<>> అయినట్లు వచ్చిన వార్తలను ఇన్‌స్టాగ్రామ్ ఖండించింది. యూజర్లు పాస్‌వర్డ్ మార్చుకోవాలని తమ పేరుతో వచ్చిన మెయిల్స్‌ను పట్టించుకోవద్దని కోరింది. అలా మెయిల్స్ రావడానికి కారణమైన సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. ప్రతిఒక్కరి ఇన్‌స్టా ఖాతా సేఫ్‌గా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా క్రియేట్ అయిన గందరగోళానికి క్షమాపణలు చెప్పింది.

News January 11, 2026

ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

image

AP: ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. 13,257 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

News January 11, 2026

డియర్ పేరెంట్స్.. పిల్లలు జాగ్రత్త

image

సంక్రాంతికి పిల్లలంతా గాలిపటాలు ఎగరేసే ఉత్సాహంలో ఉంటారు. ఒకవైపు చైనా మాంజా ప్రమాదకారిగా మారితే.. మరోవైపు విద్యుత్ షాక్‌లు పేరెంట్స్‌ను కంగారు పెడుతున్నాయి. అన్నమయ్య జిల్లా గోరంచెరువు గ్రామంలో గాలిపటం ఎగరవేస్తూ విద్యుత్ తీగలు తగిలి ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. డాబాలు, అపార్ట్‌మెంట్లు కాకుండా ఓపెన్ ప్లేస్, గ్రౌండుకు తీసుకెళ్లి పతంగి ఎగరేయించండి. బాల్కనీల్లో గాలిపటాలు ఎగరేయడం ప్రమాదకరం. ShareIt.