News May 12, 2024
13న సాయంత్రం 6 వరకు 144 సెక్షన్: ఎస్పీ

13వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు 48 గంటల పాటు 144 సెక్షను అమల్లో ఉంటుందని అనంతపురం ఎస్పీ బర్దర్ తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎన్నికల కమిషన్ డ్రైడే ప్రకటించడంతో శనివారం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయించామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డయల్ 100 లేదా జిల్లా పోలీసు ఎన్నికల విభాగం 93929 18293కు తెలియజేయాలన్నారు.
Similar News
News October 28, 2025
‘విధులకు హాజరు కాని ముగ్గురు డాక్టర్లకు మెమోలు జారీ’

ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్వో దేవి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలోని తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ విధుల్లో లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 28, 2025
అనంత: జిల్లా అధికారులతో సమావేశం

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో షెడ్యుల్డ్ కులాల సంక్షేమం కొరకు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీశ్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ అధ్యక్షులు కుమార్ రాజావర్ల పాల్గొన్నారు. కమిటీ సభ్యులు కావలి గ్రీష్మ, ఎమ్మెస్ రాజు, విజయ్ కుమార్ బిఎన్, రోషన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
News October 27, 2025
అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


