News May 12, 2024
మల్కాజ్‌గిరి: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్ ఓటర్లదే కీలక భూమిక. లోక్‌సభ నియోజక వర్గాలన్నింటిలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఓటర్లు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 19, 2026
RR: సర్పంచ్‌లకు ముచ్చింతల్‌లో శిక్షణ

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 5 విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని 2 సమావేశ మందిరాలను సిద్ధం చేశారు.
News January 19, 2026
RR: 5 విడతల్లో సర్పంచ్‌లకు శిక్షణ

ఈ నెల19 నుంచి 23 వరకు నూతన సర్పంచ్‌లకు మొదటి విడతలో శిక్షణను ఇవ్వనున్నారు. మొదటి విడతలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 2వ విడతలో మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, 3వ విడతలో కందుకూరు, నందిగామ, మహేశ్వరం, కేశంపేట, 4వ విడతలో ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ, 5వ విడతలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, శంషాబాద్ సర్పంచ్‌లకు ఇవ్వనున్నారు.
News January 18, 2026
మునిసిపల్ ఎన్నికలు.. అభ్యర్థులారా ఇవి తెలుసుకోండి

2026 మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అర్హతలు, నామినేషన్ నిబంధనలు, ఖర్చు పరిమితులు తప్పక తెలుసుకోవాలి. భారత పౌరుడై 21 ఏళ్లు నిండాలి. సంబంధిత వార్డు ఓటరై ఉండాలి. పార్టీ అభ్యర్థికి ఒక ప్రపోజర్, స్వతంత్ర అభ్యర్థికి 10 మంది ప్రపోజర్లు అవసరం. ఖర్చు పరిమితి మునిసిపాలిటీ రకాన్ని బట్టి రూ.2-రూ.10లక్షల వరకుంటుంది. ప్రతి ఖర్చు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిక రద్దవుతుంది.


