News May 12, 2024
NLG: ఓటరు కార్డు లేనివారికి ప్రత్యామ్నాయ కార్డులు

ఓటరు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 1.పాస్పోర్టు 2.డ్రైవింగ్ లైసెన్స్, 3.ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు, కార్డులు 4.బ్యాంకు, పోస్టాఫీసు పాస్ బుక్ 5.పాన్ కార్డు, 6.ఆర్టీఐ ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు, 7.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్ కార్డు, 8.కార్మిక శాఖ ఇచ్చిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం, 10.ఆధార్ కార్డు చూపించి ఓటు వేయవచ్చు.
Similar News
News January 17, 2026
కట్టంగూరు శివారులో యాక్సిడెంట్

ముత్యాలమ్మగూడెం శివారులో జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎన్.అనిల్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 17, 2026
నల్గొండ తొలి మేయర్గా ‘ఆమె’

నల్గొండ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారైంది. ప్రభుత్వం ఈ పదవిని ‘జనరల్ మహిళ’కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 17, 2026
నల్గొండ: మునిసి’పోల్స్ ‘కు ముందస్తు ప్రచారం!

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఆశావహులు ఓటర్ల తలుపు తడుతున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి రెడీ అయిన వారిలో చాలామంది వారం, పది రోజులుగా నల్గొండతో పాటు MLG పట్టణంలోని గల్లీల్లో తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాట పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.


