News May 12, 2024

సివిల్ సర్వీస్ వ్యవస్థలో నిజాయతీ తగ్గింది: దువ్వూరి

image

భారత్‌లోని సివిల్ సర్వీసులు, IAS వ్యవస్థలో నీతి, నిజాయతీ తగ్గుతోందని RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆరోపించారు. ఈ వ్యవస్థను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ఓ పుస్తకంలో IAS వ్యవస్థ ప్రక్షాళనపై తన అభిప్రాయాలను రాసుకొచ్చారు. ఏనాడో బ్రిటిషు వారు తయారు చేసిన IAS అనే స్టీల్ ఫ్రేమ్ ఇప్పుడు తుప్పుపట్టిందన్నారు. దీన్ని సరిచేసి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News November 11, 2025

నిఠారి కిల్లింగ్స్: సురేంద్ర కోలికి సుప్రీంలో ఊరట

image

నిఠారి వరుస హత్యల చివరి కేసులో సురేంద్ర కోలి దోషి కాదని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. మిగతా కేసుల్లోనూ రిలీఫ్ పొందిన కోలి త్వరలో జైలు నుంచి విడుదల కానున్నాడు. నోయిడా శివారు నిఠారి గ్రామంలో 2006 DEC 29న మోహిందర్ పందేర్ ఇంటి వెనక డ్రెయిన్‌లో 8 మంది చిన్నారుల ఎముకలు లభ్యమయ్యాయి. దీనిపై దర్యాప్తు చేసిన CBI పందేర్, కోలి హత్యాచారాలకు పాల్పడ్డారని తేల్చింది. అయితే కోర్టుల్లో నిరూపించలేకపోయింది.

News November 11, 2025

టమాటాలో బాక్టీరియా ఎండు తెగులును ఎలా నివారించాలి?

image

బాక్టీరియా ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పీకి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. మొక్కను తొలగించిన చోట వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా ఇతర మొక్కలకు సోకదు. టమాటా నారును నాటుకునే ముందే వేపపిండిని నేలలో చల్లుకోవడం వల్ల ఈ తెగులు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. తెగులు సోకిన మొక్కలు పొలంలో ఉన్నప్పుడు నీటి తడులు ఇస్తే ఈ తెగులు ఉద్ధృతి మరింత పెరిగి నివారణ కష్టమవుతుంది.

News November 11, 2025

స్టాక్ మార్కెట్లో LIC ₹16 లక్షల కోట్ల పెట్టుబడి

image

LIC అంటే తెలియని వారుండరు. ఇందులో అనేకమంది భాగస్వామ్యం ఉంది. వారి సొమ్ము లక్షల కోట్లు ఇందులో ఉన్నాయి. ఇలా వచ్చిన సొమ్మును సంస్థ పలు రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది. ఇలా ఇప్పటివరకు ₹16 లక్షల కోట్లు పెట్టింది. తాజాగా HDFC, ICICI వంటి ప్రయివేటు బ్యాంకుల షేర్లను విక్రయించి SBIలో పెట్టుబడి పెట్టింది. ఇటీవల అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టగా విమర్శలు రావడంతో స్వయంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.