News May 12, 2024
ఎలక్షన్ డ్యూటీకి వెళ్తుండగా ఉపాధ్యాయుడికి ఫిట్స్

ఎలక్షన్ విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురయ్యారు. గంగవరం మండలం బియ్యంపాలెం ఎంపీపీ స్కూల్ టీచర్ తమన్నదొర శనివారం సాయంత్రం తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో పాడేరు వెళ్తున్నారు. అడ్డతీగల మండలం వీరభద్రాపురం సమీపంలో తమన్నదొరకు ఫిట్స్ రాగా.. స్థానిక యూటీఎఫ్ నాయకులు ఆర్వో ప్రశాంత్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. అధికారుల అనుమతితో ఇంటికి చేర్చారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.
Similar News
News March 4, 2026
రాజమండ్రిలో విద్యుత్ ఘాతానికి గురైన విద్యార్థులు

రాజమండ్రి అనుశ్రీ థియేటర్ వద్ద ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం విద్యుత్ ఘాతానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్ రామ్ విద్యార్థులను పరామర్శించారు. 15వ వార్డు చెందిన యన్.రమేశ్, 27వ వార్డు చెందిన ఉజ్వల ఈశ్వర సాయిలు మామిడికాయలు కోయడానికి వెళ్లే ప్రయత్నంలో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. అధికారులు స్పందించాలని భరత్ కోరారు.
News March 4, 2026
తూ.గో: మొబైల్ వాడొద్దన్నారని..!

బిక్కవోలు మండలం బలబద్రపురంలో అదృశ్యమైన బాలికను ఐదు గంటల్లోనే గుర్తించినట్లు SI రవిచంద్ర కుమార్ తెలిపారు. మొబైల్ ఎక్కువగా వాడుతోందని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చేపట్టి బాలిక ఆచూకీ కనిపెట్టారు. అనంతరం ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
News March 4, 2026
రాజమండ్రి: అపార్ట్‌మెంట్‌లో వివాహిత ఆత్మహత్య

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు పరిధిలోని హుగ్గం పేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న GVK Signature 202 అపార్ట్‌మెంట్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు, అనుమానమే ఈ ప్రాణం తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


