News May 12, 2024

భీమవరంలో విషాదం.. ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి

image

ప.గో జిల్లా భీమవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని నాచువారి సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5వ తరగతి విద్యార్థిని దుండి జ్యోతిప్రియ మృతి చెందింది. కరాటే నేర్చుకునేందుకు బాలిక సైకిల్‌పై వెళ్తుండగా.. ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. జ్యోతిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక తండ్రి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నారు.

Similar News

News December 29, 2025

ప.గో: ఓ వైపు బరులు.. మరోవైపు వినతులు

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో పలుచోట్ల కోడి పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేస్తున్నారు. అధికారిక అనుమతులు రాకముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీరవాసరం, ఆకివీడు, భీమవరం మండలాల్లో పందేలను నివారించాలంటూ స్థానికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తుండటం గమనార్హం. ఓవైపు పందేలకు సన్నాహాలు, మరోవైపు ప్రజల అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.

News December 29, 2025

ప.గో: దర్శనానికి వేళాయె.. ఏడాదికోకసారి లభించే భాగ్యం

image

ద్వారకాతిరుమల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా గిరిప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం 5 కిలోమీటర్ల మార్గంలో ఎండుగడ్డి, టెంట్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గం: నుంచి ఏడాదికొకసారి లభించే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది.

News December 29, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.