News May 12, 2024
మంగళగిరిలో బాబు.. పుంగనూరులో పెద్దిరెడ్డి

ఈసారి ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు వాళ్లకి వాళ్లే ఓటు వేసుకునే అవకాశం లేదు. కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు మంగళగిరిలో ఓటు వేస్తారు. వైసీపీ తంబళ్లపల్లె అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని తన స్వగ్రామం ఎర్రాతివారిపాలెంలో, నగరి అభ్యర్థి భానుప్రకాశ్ రామచంద్రాపురం మండలంలో, పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ బాబు చిత్తూరు మండలం వెంకటాపురం హరిజనవాడలో ఓటు వేస్తారు.
Similar News
News March 13, 2026
చిత్తూరు: ముగ్గరికి రెండేళ్ల జైలు శిక్ష

ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 2014 నవంబర్‌లో రొంపిచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారు. నిందితులు తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్‌కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు.
News March 13, 2026
చిత్తూరు జిల్లాకు రూ.115 కోట్ల మంజూరు

చిత్తూరు జిల్లాలో 2.05 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవకు సంబంధించి రూ.115 కోట్లు జమ కానున్నాయి. చిత్తూరులో 11,321 మంది రైతులకు రూ.6.32 కోట్లు, పూతలపట్టులో33,881- రూ.19.27 కోట్లు, పలమనేరు-38,368- రూ.21.71 కోట్లు, కుప్పం- 36,673- రూ.19.80 కోట్లు, పుంగనూరు- 37,191- రూ. 21.23 కోట్లు, నగరి- 12,472- రూ.7.06 కోట్లు, జీడీ నెల్లూరులో 36,047 మందికి రూ.20.43 కోట్లు మంజూరయ్యాయి.
News March 13, 2026
చిత్తూరు: పది పరీక్షలు.. 1210మంది ఇన్విజిలేటర్లు

టెన్త్ పబ్లిక్ పరీక్షలకు తొలి విడతగా 1210 మంది టీచర్లకు ఇన్విజిలేషన్ డ్యూటీలు వేసినట్లు చిత్తూరు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరంతా ఈనెల 16, 18, 21, 31, మే ఒకటో తేది పనిచేయాల్సి ఉందన్నారు. వీరికి 10KM పరిధిలోనే ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశామని చెప్పారు. ఎమర్జెన్సీ, గర్భిణులు, నిబంధనల ప్రకారం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధులు నిర్వహించ లేనివారు తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.


