News May 12, 2024

ఈ జీవితమే అమ్మది: చిరంజీవి

image

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ మాతృమూర్తులను స్మరించుకుంటున్నారు. వారితో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ వారికి శుభాకంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవితో కలిసున్న ఫొటోను పోస్ట్ చేశారు. ‘జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మకి ఈ ఒక రోజు ఏంటి.. ప్రతి రోజూ అమ్మదే.. ఈ జీవితమే అమ్మది. హ్యాపీ మదర్స్ డే’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Similar News

News March 15, 2025

ఇతర మతాలవారిని తిట్టగలరా?: పవన్ కళ్యాణ్

image

AP: తనను సనాతన ధర్మం రక్షకుడని ఓ ఆంగ్ల జర్నలిస్టు ఎద్దేవా చేశారంటూ Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘మా రాముడి విగ్రహం తల నరికేస్తే మా మనోభావాలు గాయపడకూడదా? నోరు మూసుకుని కూర్చోవాలా? మీరు అల్లానో, జీసస్‌నో, మేరీమాతనో అవమానించి బతకగలరా? కానీ లక్ష్మీ దేవిని, సరస్వతి దేవిని అవమానిస్తారు. రథాల్ని తగులబెట్టేస్తారు. తప్పును తప్పని చెబితే మతోన్మాదమా?’ అని ప్రశ్నించారు.

News March 15, 2025

పవన్ ప్రసంగంపై అంబటి సెటైర్

image

AP: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘జయకేతనంలో ఏమి చెప్పాలనుకున్నాడో ఏమి చెప్పాడో పాపం పవన్ కళ్యాణ్’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

News March 15, 2025

కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

image

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించారు. దీంతో అధికార లిబరల్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా పనిచేసిన కార్నీ విజయం సాధించారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించిన వేళ కార్నీకి పెను సవాళ్లు ఎదురు కానున్నాయి.

error: Content is protected !!