News May 12, 2024
IOS యూజర్లకు వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్

IOS యూజర్లకు వాట్సాప్ ‘స్క్రీన్ షాట్ బ్లాకింగ్-ప్రొఫైల్ ఫొటో’ పేరిట కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని వల్ల యూజర్ల ప్రొఫైల్ ఫొటోలను ఇతరులు స్క్రీన్ షాట్ తీసేందుకు వీలుండదు. దీంతో వారి పిక్చర్స్ మిస్ యూజ్ కాకుండా ఉంటాయి. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత ఏర్పడుతుందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.
Similar News
News March 20, 2026
తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన

TGలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, NZB, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 41-61KM వేగంతో గాలులు వీచే ఆస్కారముందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు నిన్న రాత్రి HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
News March 20, 2026
108ఏళ్ల మాజీ MLA కన్నుమూత

AP: చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న రాజన్(108) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబర జీవితం గడిపారు. ప్రభుత్వ పెన్షన్‌తోనే జీవనం సాగించారు.
News March 20, 2026
ఉద్యాన పంటలపై అకాల వర్షాల పంజా

AP: అనంతపురం, శ్రీసత్యసాయి, NTR జిల్లాల్లోని ఉద్యాన పంటలపై అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, బత్తాయి పంటలతో పాటు టమాట, ఇతర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షాలపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంట నష్టానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని, వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.


