News May 12, 2024
ఆదిలాబాద్: ఈసారి ప్రచారంలో కనిపించని జోష్

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ పార్లమెంట్‌లో అంతగా జోష్ కనిపించలేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంతో చాలా గ్రామాల్లో ప్రచారం పూర్తిగా నిర్వహించలేకపోయారు. పలువురు నాయకులు సైతం వడదెబ్బకు గురికావడంతో కార్యకర్తలు పగటి పూట ప్రచారం చేయాడానికి అంతగా ఆసక్తి చూపలేదు. పార్టీలకు చెందిన కీలక నేతలు మాత్రమే ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
Similar News
News December 30, 2025
ఆదిలాబాద్: చైనా మంజా.. 5 కేసులు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో చైనా మంజాపై పూర్తిగా నిషేధం విధించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా, దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు వన్ టౌన్‌లో 5 కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా చైనా మంజా విక్రయిస్తే సమాచారం అందించాలని కోరారు.
News December 30, 2025
ఆదిలాబాద్: 2025లో పోలీసుల అద్భుత ఫలితాలు

2025లో పోలీసులు అద్భుత ఫలితాలు సాధించారు. గతేడాది 20గా ఉన్న నేరస్తుల శిక్షల సంఖ్య ఈసారి 51కి పెరిగింది. CEIR ద్వారా 718 ఫోన్లను రికవరీ చేశారు. షీ టీమ్స్, పోలీస్ అక్క కార్యక్రమాలతో మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. డ్రగ్స్, బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం, ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. హత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడమని ఎస్పీ వెల్లడించారు.
News December 29, 2025
38 ఫిర్యాదులు నమోదు: ADB ఎస్పీ

సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 38 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయనతో పాటు శిక్షణ ఐపీఎస్ రాహుల్ పంత్, సీసీ కొండరాజు, కవిత, వామన్ ఉన్నారు.


