News May 12, 2024

అమ్మ ప్రేమ అనంతం.. ఒక్కరోజు చాలదు!

image

మదర్స్ డే అనగానే సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెడుతుంటారు. మీ కోసం, కుటుంబం కోసం ఎంతో చేసే తల్లులను ఒక్కరోజు మాత్రమే తలుచుకుంటే సరిపోదు. దూరంగా ఉంటే తిన్నావా అని, బయటికెళ్తుంటే జాగ్రత్త అని అమ్మ చెప్తే కొందరు విసిగించుకుంటారు. అందులోనూ ప్రేమే ఉందని అర్థం చేసుకోవాలి. ఆమె లేకపోతే ఈ జన్మ లేదని గుర్తించాలి. అందుకే దగ్గరుంటే నేరుగా, దూరంగా ఉంటే ఫోన్‌లో అమ్మతో రోజూ కాసేపు ప్రేమగా మాట్లాడండి.

Similar News

News January 7, 2025

కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి

image

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్రం తక్షణమే అందజేస్తుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు.

News January 7, 2025

ఇలా చేస్తే HAPPY LIFE మీ సొంతం

image

ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాల్లో నియంత్రణ అవసరం. జీవితాన్ని ఉత్తమంగా మార్చేందుకు ఈ 5Mను కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. *MOUTH-ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. *MIND-ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. *MANNER- మర్యాదపూర్వక ప్రవర్తన. *MOOD- భావోద్వేగాల నియంత్రణ. *MONEY- ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ వంటివి పాటిస్తే జీవితం మెరుగ్గా ఉంటుందని సూచిస్తున్నారు.

News January 7, 2025

తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సిఫార్సు

image

తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది. 2023 జులైలో రాష్ట్ర హైకోర్టు సీజేగా అలోక్ నియమితులయ్యారు. మరోవైపు బాంబే హైకోర్టు సీజే దేవేంద్ర కుమార్‌ను ఢిల్లీ HCకి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.