News May 12, 2024

IPL: ఇవాళ ఓడితే ఇంటికే

image

వరుసగా 4 విజయాలతో జోరు మీదున్న RCB ఇవాళ బెంగళూరు వేదికగా DCని ఢీకొంటోంది. మ్యాచ్ రద్దయినా లేదా ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవుతాయి. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉండటం ఆ జట్టుకు ప్రతికూలాంశంగా మారింది. మ్యాచ్ రద్దయితే ఢిల్లీకి ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు మిగిలే ఉంటాయి. ఏదేమైనా పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో ఉండే అవకాశాల్ని మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచులో గెలవడం ఇరుజట్లకూ కీలకం కానుంది.

Similar News

News January 7, 2025

కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన అఖిలేశ్

image

కాంగ్రెస్ పార్టీకి SP చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవకాశాన్ని ఆప్‌న‌కు మ‌రోసారి రావాల‌ని గతంలోనూ ఆయన ఆకాంక్షించారు. తమకు మద్దతిచ్చినందుకు కేజ్రీవాల్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. యూపీతో సరిహద్దును పంచుకొనే ఢిల్లీలో అఖిలేశ్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుందని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 7, 2025

కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి

image

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్రం తక్షణమే అందజేస్తుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు.

News January 7, 2025

ఇలా చేస్తే HAPPY LIFE మీ సొంతం

image

ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని విషయాల్లో నియంత్రణ అవసరం. జీవితాన్ని ఉత్తమంగా మార్చేందుకు ఈ 5Mను కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. *MOUTH-ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. *MIND-ప్రతి విషయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. *MANNER- మర్యాదపూర్వక ప్రవర్తన. *MOOD- భావోద్వేగాల నియంత్రణ. *MONEY- ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ వంటివి పాటిస్తే జీవితం మెరుగ్గా ఉంటుందని సూచిస్తున్నారు.