News May 12, 2024
శ్రీకాకుళం: రేపే పోలింగ్.. ఈ నంబర్లు మీకోసమే

జిల్లాలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ తెలిపారు. ☞ జిల్లాలో మొత్తం ఓటర్లు- 18,92,457 మంది ☞ పోలింగ్ కేంద్రాలు- 2,358 ☞ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు- 520 ☞ పోలింగ్ రోజు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్- 18004256625 ☞ ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం – 1950
Similar News
News March 17, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటినుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అప్పలనారాయణ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. అయితే సంబంధిత దివ్యాంగులు శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్టీసీ బస్టాండ్‌లో మూడు సంవత్సరాలకు ఒక పాస్‌ను పొందవలసి ఉంటుందన్నారు.
News March 17, 2026
నందిగాం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

నందిగాం మండలం లట్టిగాం సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలాస నుంచి 49 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద ఆగడంతో వెనుక నుంచి వస్తున్న ట్రావెల్ బస్సు ఢీకొంది.
News March 17, 2026
శ్రీకాకుళం: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.


