News May 12, 2024
UPDATE: మహిళల మృతదేహాలు లభ్యం

గోదావరిలో మునిగి చనిపోయిన ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన ముగ్గురి డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. పల్లూరి సత్యఅనంతలక్ష్మి(40), కప్పిరెడ్డి ఏసమ్మ(60), కర్రీ సునీత శనివారం వాడపల్లి వెంకటేశ్వరాలయానికి గోదావరి పాయలోంచి నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో మడికి వద్ద వాడపల్లిలంక సమీపంలో వారు <<13231697>>నీటిలో మునిగిన సంగతి <<>>తెలిసిందే. మృతదేహాలు లభ్యం కాగా.. SI శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. మరొకరి ఆచూకీ తెలియరాలేదు.
Similar News
News November 15, 2025
తూ.గో: 48 గంటల్లో రూ.56.84 కోట్ల జమ

తూ.గో జిల్లా ధాన్యం సేకరణ అంచనా 4 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించినట్లు జేసీ వై.మేఘ స్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతానికి 5,890 ధాన్యం కొనుగోలు కూపన్లు జనరేట్ చేశామన్నారు. 16 మండలాల్లో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3,695 మంది రైతుల నుంచి 27,616.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోపే 3,191 మంది రైతులకు రూ. 56.84 కోట్లు జమ చేశామని తెలిపారు.
News November 15, 2025
తూ.గో: సదరం క్యాంపులు ప్రారంభం

తూ.గో జిల్లా వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DCHS డా.ఎం.పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రతి మంగళవారం ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు, GGHల్లో సదరం సర్టిఫికెట్ల కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు.
News November 15, 2025
దివాన్ చెరువులో కొత్త బిల్డింగ్‌కు రూ.3కోట్లు

రాజమహేంద్రవరం రూరల్ డివిజన్, సబ్-డివిజన్, రూరల్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులకు సంబంధించిన భవనాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ ఒకేచోట ఉండేలా దివాన్ చెరువులో కొత్తగా భవనం నిర్మించనున్నారు. దీని కోసం రూ.3కోట్లు మంజూరయ్యాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజకి కృతజ్ఞతలు తెలిపారు.


