News May 12, 2024

నెల్లూరులో ఈసారి 85 శాతం అయ్యేనా?

image

గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 79 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 85 శాతానికి పెంచాలని అధికారులు కృషి చేస్తున్నారు. పోయినసారి ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయో చూద్దాం.
➤ కావలి: 76.3 ➤ ఆత్మకూరు: 83.3
➤ కోవూరు: 77.6 ➤ నెల్లూరు సిటీ: 663
➤ నెల్లూరు రూరల్: 65.2 ➤ సర్వేపల్లి: 82.1
➤ గూడూరు: 77.8 ➤ సూళ్లూరుపేట: 83.2
➤ వెంకటగిరి: 79.3 ➤ ఉదయగిరి: 80.3

Similar News

News January 1, 2026

నెల్లూరు జిల్లాలో 25మందికి జైలుశిక్ష

image

జిల్లాలో 18 ఏళ్ల లోపు ఉన్నవారిపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో కేసులు నమోదు చేస్తున్నారు. 2025లో 15 పోక్సో, రేప్ కేసులు నమోదయ్యాయి. 8 మర్డర్ కేసులు ఫైల్ చేశారు. ఇతర కేసులు 2 నమోదయ్యాయి. వీరిలో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి కఠిన కారాగార శిక్ష 20 ఏళ్లు, నలుగురికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్య జైలుశిక్ష ఏడుగురికి పడింది. మొత్తంగా 25మంది జైలుకు వెళ్లారు.

News January 1, 2026

నెల్లూరు: ఇవాళ మీకు సెలవు ఇచ్చారా?

image

నెల్లూరు జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. చాలామంది ఇవాళ దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటారు. ఈనేపథ్యంలో ఆప్షన్ లీవ్ వాడుకోవచ్చు. ఏడాదికి 5ఆప్షన్ హాలిడేస్ ఉంటాయి. జిల్లాలోని కొన్ని స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ఇచ్చారు. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.

News December 31, 2025

నెల్లూరు : 2 నుంచి రీ సర్వే

image

నెల్లూరు జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రక్రియ జనవరి 2వ తేదీ నుంచి మొదలవుతోంది. AP రీసర్వే ప్రాజెక్టులో జిల్లా నందు 93 గ్రామాలు ఎంపిక చేశారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి 26 గ్రామాలు, కావలి డివిజన్ నుంచి 26, గూడూరు డివిజన్ నుంచి 14, నెల్లూరు డివిజన్ 27 గ్రామాలు కలిపి 357270.62 ఎకరములు రీసర్వే చేయనున్నారు. రైతులు రీసర్వేలో పాల్గొనాలని జేసీ వెంకటేశ్వర్లు, DD వై.నాగశేఖర్ కోరారు.