News May 12, 2024

శ్రీకాకుళం: ఎలక్షన్@2024.. మూడు జిల్లాల ముచ్చట

image

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు విజయనగరం ఎంపీ స్థానానికి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖ ఎంపీ అభ్యర్థికి ఓటు వేస్తారు. అటు అల్లూరి జిల్లాలో ఉన్న అరకు ఎంపీ అభ్యర్థికి పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గ ఓటర్లు తమ ఓటును వేయాల్సి ఉంటుంది.

Similar News

News July 6, 2025

శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

image

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల, స్కూల్ స్వీపర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం రూ.20/-లు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.

News July 6, 2025

SKLM: వ్యాధులు పట్ల అప్రమత్తం అవసరం

image

పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు పట్ల అప్రమత్తతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాలరావు అన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల నుంచి ర్యాబిస్, స్వైన్ ఫ్లూ, యంత్రాక్స్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు.

News July 6, 2025

శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

image

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.